ఏలూరు డివిజన్ పరిధిలో భారీవర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాలలో దెబ్బతిన్న ఇళ్లకు, పశు నష్టంకు సంబంధించి బాధితుల జాబితాను ఏలూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయాల్లో నోటీసు బోర్డులో ప్రదర్శించడం జరిగిందని ఆర్డీవో
ఎన్ ఏస్ కె ఖాజావలి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు జాబితాను బాధితులు పరిశీలించుకుని ఏమైనా అభ్యంతరాలు ఉంటే, తక్షణమే తహసీల్దార్ల దృష్టికి తీసుకురావాలని కోరారు.