నగరంలో తిరిగే ప్రతి ఆటోకు క్యూఆర్‌కోడ్ స్టిక్కర్ ఇస్తామని, కోడ్ స్కాన్ చేయగానే ఆటో యజమాని అడ్రస్సు, స్టాండ్, ఫోన్‌నెంబర్, ఆధార్ వివరాలు తెలుస్తాయని ట్రాఫిక్ సీఐ కె శ్రీనివాసరావు అన్నారు. అమీనా పేట సురేష్‌చంద్ర బహుగుణ స్కూలు వద్ద కల్యాణమండపంలో నగరంలో ఆటో డ్రైవర్లతో రోడ్డు నిబంధన అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. డ్రైవర్లు తప్పనిసరిగా ఆటోలో కనిపించే విధంగా కోడ్ ఉంచాలన్నారు. ప్రయాణికులు ఆటో ఎక్కేటప్పుడు క్యూఆర్‌కోడ్ ఫోటో తీసి తమ బంధువులకు పంపించాలని దీని వల్ల ఆటో ఎటు వెళుతుందో జీపీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా గమనాన్ని తెలుసుకో వచ్చన్నారు.