ఏలూరు రూరల్ మండలం దొండపాడులోని దత్తనాధ క్షేత్రమునందు ఏర్పాటుచేసిన ద్వి పుష్కర సంప్రోక్షణ మహా యజ్ఞంలో మంగళవారం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. దత్తనాధ క్షేత్రం ప్రతిష్టాపించి 24 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దత్తాత్రేయ స్వామి వారికి, వేణుగోపాల స్వామి వారికి , ఆంజనేయ స్వామికి, సుబ్రమణ్య స్వామివారికి , శివుడికి, కుంభాభిషేకం జరుగుతుందన్నారు.