స్వచ్ఛతాహీ సేవా-2024 కార్యక్రమం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో చేపట్టి పరిశుభ్రత, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించుకోవాలని జిల్లా రెవిన్యూ అధికారి విశ్వేశ్వరరావు అన్నారు. శనివారం కలెక్టరేట్ ఆవరణంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమాన్ని కలెక్టరేట్ సిబ్బందితో చేపట్టారు. ఈ సందర్బంగా డిఆర్ఓ మాట్లాడుతూ మన ఇంటి పరిశుభ్రతే కాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.