నరసాపురం పురపాలక సంఘం పరిధిలోని 11 వ వార్డు నందు మండసత్యనారాయణ మూర్తి చేపల మార్కెట్ లో దుర్వాసన వస్తుంది అని చుట్టుపక్కల వున్నా స్థానికులు చెప్పడం జరిగింది. తక్షణమే మున్సిపల్ కమిషనర్ ఎం అంజయ్య స్పందించి గురువారం చేపల మార్కెట్ లో స్ప్రే చేయించారు.ఈ సందర్భంగా కమిషనర్ అంజయ్య మాట్లాడుతూ పట్టణ పరిధిలో ఉన్న ప్రతి వార్డులో స్థానికులు పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాలని సూచించారు.