చిరంజీవి జన్మదిన వేడుకల్లో మాజీ మంత్రి కొత్తపల్లి

76చూసినవారు
మొగల్తూరులోని చిరంజీవి గ్రంధాలయం వద్ద పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. చిరు పవన్ అభిమానుల మండల శాఖ అధ్యక్షుడు దాసరి కృష్ణాజి ఆధ్వర్యంలో అభిమానులు ఏర్పాటుచేసిన కేకును ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కోసి ప్రజలకు పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేయాలని వారు అభిమానులకు సూచించారు.

సంబంధిత పోస్ట్