పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు గ్రామంలో గల శ్రీ రాజగోపాలస్వామి ఆలయం నందు భజన మండలి సభ్యులు అనంతపల్లి రాజేశ్వరి, సుహాసిని, సుందరి, కారుమూరి రాజ్యలక్ష్మి , ప్రభ మరియు భజన మండలి సభ్యులచే "భగవద్గీత పారాయణం"ఘనంగా బుధవారం మధ్యాహ్నం నిర్వహించారు. అనంతరం శ్రీ ఆకన రాముచే ప్రసాద వితరణ జరిగింది. మొగల్తూరు గ్రామానికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.