క్రీస్తు సందేశం ఆచరించదగినవని కృష్ణా జిల్లా వేట్ల పాలానికి చెందిన పాస్టర్ పి. జేమ్స్ అన్నారు. మొగల్తూరు లోని స్నేహ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బైబిల్ లోని లూక తెలిపిన వ్యాఖ్యలను చదివి వినిపించారు. అనంతరం ఆటో యూనియన్ సభ్యులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కోసి ప్రజలకు పంపిణీ చేశారు. అనంతరం సహపంతి భోజనాలు చేశారు.