నరసాపురం పట్టణం 18 వార్డు బాలచంద్ర మౌలేశ్వర స్వామి టెంపుల్ ఆలయం సమీపంలో.. గత కొంతకాలంగా మున్సిపల్ స్థలంలో పిచ్చి మొక్కలు, వ్యర్థాలతో నిండి ఉంది. దీంతో దోమలు, పాములతో ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక మున్సిపల్ అదికారుల దృష్టికి స్థానికులు తీసుకువచ్చారు. మున్సిపల్ కమిషనర్ అంజయ్య స్పందించి బుధవారం సందర్శించారు. ఈ క్రమంలో పిచ్చి మొక్కలు, డొంకలు పూర్తిగా తొలగించి శుభ్ర పరిచాలని కమిషనర్ అంజయ్య శానిటరీ సిబ్బందికి అదేశాలు జారీచేశారు.