నర్సాపురం బార్ అసోసియేషన్ న్యాయవాదుల ఆధ్వర్యంలో బార్ కౌన్సిల్ హాల్లో శుక్రవారం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బార్ కౌన్సిల్ అధ్యక్షులు చేగొండి బాలాజీ, ఉపాధ్యక్షులు కొత్తపల్లి రమేష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి, భారతరత్న డా. బి. ఆర్. అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకుని ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించడం జరిగిందన్నారు.