ప. గో.: మత్స్యకారులకు హెచ్చరిక.

85చూసినవారు
ప. గో.: మత్స్యకారులకు హెచ్చరిక.
సముద్రంలో ఈనెల 15 నుంచి జూన్ 14 వరకు మర పడవల్లో అన్నిరకాల చేపల వేట నిషేధించినట్లు జిల్లా మత్స్యశాఖాధికారి ప్రసాద్ తెలిపారు. సముద్ర జలాల్లో 15 నుంచి రెండు నెలల పాటు చేప, రొయ్య, మత్స్య జాతుల సంతానోత్పత్తి కాలం కావడంతో యాంత్రిక చేపల వేటను ప్రభుత్వం నిషేధించిందన్నారు. మత్స్యకారులు, బోట్ల యజమానులు సహకరించాలని కోరారు. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే బోటు రిజిస్ట్రేషన్ రద్దు చేసి చర్యలు తీసుకుంటామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్