ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో వచ్చిన ప్రతి ఒక్క వినతిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించే దిశగా అధికారులకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం- పిజిఆర్ఎస్) కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి 146 అర్జీలను స్వీకరించారు.