ఎన్నికల సందర్భంగా అల్లర్లకు వెళ్లొద్దు

1090చూసినవారు
ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు నూజివీడు రూరల్ సీఐ రామకృష్ణ అన్నారు. బుధవారం మండల కేంద్రమైన ముసునూరులో కేంద్ర బలగాలతో పోలీసులు కవాతు నిర్వహించారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని ఆయన అన్నారు. ప్రజలు ఎన్నికల సందర్భంగా ఎటువంటి అల్లర్లకు పాల్పడవద్దని ఆయన హెచ్చరించారు. ముసునూరులోని పలు ప్రధాన రహదారుల వెంబడి పోలీసులు కవాతు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్