రేపు నామినేషన్ వేయనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి

592చూసినవారు
రేపు నామినేషన్ వేయనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి
పాలకొల్లు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలుకులూరి అర్జునరావు రేపు శుక్రవారం నామినేషన్ పత్రాలను స్థానిక మున్సిపల్ కార్యాలయంలో దాఖలు చేస్తారని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు యడ్ల శివాజీ గురువారం తెలిపారు. పాలకొల్లు పట్టణ కాంగ్రెస్ కార్యాలయం నుండి ఉదయం 9 గంటలకు బయలుదేరి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యర్రవంతెన, గాంధీ బొమ్మలు, మెయిన్ రోడ్డు మీదుగా మున్సిపల్ కార్యాలయం చేరుకుంటారని వివరించారు.

సంబంధిత పోస్ట్