పాలకొల్లు: తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

571చూసినవారు
తండ్రికి, కూతురు తలకొరివి పెట్టిన ఘటన పాలకొల్లు పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. మృతుడికి కొడుకులు లేకపోవడంతో కుమార్తే కొడుకు పాత్ర పోషించి తండ్రికి తలకొరివి పెట్టింది. పాలకొల్లు హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన పాతంశెట్టి సూర్య నారాయణ లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. ఆయనకు అనుకోని విధంగా గుండెపోటు రావడంతో మృతిచెందారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈఘటన స్థానికులను కంటతడి పెట్టించింది

సంబంధిత పోస్ట్