పాలకొల్లు మండలం పెదమామిడిపల్లిలో గురువారం ఘటోత్కచుడు అనే వ్యక్తికి చెందిన రేకుల షెడ్డులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 2 లక్షల విలువైన గృహోపకరణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదవార్త తెలియగానే పాలకొల్లు ఫైర్ ఆఫీసర్ వైవీ జానకిరామ్ ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.