రోడ్డుకు అడ్డంగా విరిగి పడిన కొబ్బరి చెట్టుని తొలగించిన జన సైనికులు

1067చూసినవారు
రోడ్డుకు అడ్డంగా విరిగి పడిన కొబ్బరి చెట్టుని తొలగించిన జన సైనికులు
పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలో ఆదివారం సాయంకాలం పెద్ద ఎత్తున వీచిన ఈదురు గాలులకు పాలకొల్లు- బగ్గేశ్వరం ఆర్ అండ్ బి రోడ్డు లో రోడ్డు ప్రక్కన ఉన్న ఒక పొడవైన కొబ్బరి చెట్టు విరిగి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. దీనితో అటుగా వెళ్తున్న వాహనాలు నిలిచిపోయాయి. ఆ వాహనాలలో పెళ్లి వారి కార్లు ఉండటంతో ఆ విషయం తెలుసుకున్న స్థానిక జనసేన పార్టీ జన సైనికులు అక్కడికి వెళ్లి కొబ్బరి చెట్టును తాళ్ళ సాయం తో రోడ్డు పక్కకు లాగి వాహనాలు వెళ్ళటానికి అడ్డం లేకుండా చేశారు. పడిపోయిన కొబ్బరి చెట్టును శ్రమదానంతో తొలగించిన జన సైనికులను అక్కడ ఉన్న వాహనదారులు ప్రశంసించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్