గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

56చూసినవారు
ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం దొరమామిడి డ్యామ్‌లో పడి వ్యక్తి మృతి చెందాడు. కొయ్యలగూడెంకు చెందిన కడలి సాయి తన స్నేహితులతో కలిసి గుబ్బల మంగమ్మ ఆలయానికి దర్శనం నిమిత్తం వెళ్లాడు. అనంతరం స్నానం చేసేందుకు దిగి దొరమామిడి జలాశయంలో ఆదివారం గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం డ్యాం వద్దకు వెళ్లి మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్