బుట్టాయిగూడెంలో సిపిఐ పార్టీ కార్యాలయాన్ని కూల్చి వేయడం పట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం అండ్ మీడియాతో మాట్లాడారు. కొంత మంది మండల అధికారులు చేసే పనులకు కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు రావడం ఖాయమని అన్నారు. అలాగే ప్రస్తుతం ఉంటున్న తహసిల్దార్ భవనంకు అసలు పట్టా ఉందా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు.