కొయ్యలగూడెం మండలం గవరవరం సబ్ స్టేషన్ పరిధిలో రాజవరం 11కేవీ వ్యవసాయ ఫీడర్ లైన్ మెయింటినెన్స్ నిమిత్తం శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ ఎస్వీ రామారావు తెలిపారు. ఈ క్రమంలో మండలంలోని గవరవరం, చొప్పరామన్నగూడెం, పరింపూడి, పొంగుటూరు గ్రామాల పరిధిలో సరఫరా బంద్ అన్నారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు.