ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం శివారులో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కల్వర్టు కొట్టుకుపోయింది. ఈ సందర్భంగా స్థానికులు కొత్త కల్వర్టు ఎత్తుగా నిర్మించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నిరసన చేపట్టారు. అలాగే ప్రతి ఏటా వర్షాలు వస్తే కలవర్టు పై నుండి భారీగా వరద నీరు ప్రవహించడం ద్వారా ఏజెన్సీలోని పలు గ్రామాలకు వాహన రాకపోకలు నిలిచిపోతున్నాయని అన్నారు.