ఏలూరు జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా

12793చూసినవారు
ఏలూరు జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం ములగలంపల్లి గ్రామ శివారులో శుక్రవారం ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన స్కూల్ బస్సుగా స్థానికులు గుర్తించారు. ప్రమాద సమయంలో ఆ బస్సులో పిల్లలు ఉన్నారా.? లేరా.? అనే వివరాలేవి తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్