తాడేపల్లిగూడెం పట్టణంలో శనివారం అట్లతద్ది పండుగను మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయాన్నే గౌరీ దేవికి పూజ నిర్వహించారు. ఉపవాసం ఆచరించి, సాయంత్రం చంద్రోదయాన్ని చూసి చెరువు, కాలువ గట్ల వద్ద గౌరీదేవికి, గోమాతలకు పూజలు జరిపారు. అలాగే, సాంప్రదాయ ఉయ్యాల ఊగడంతో పాటు ముత్తయిదువులకు వాయినాలు సమర్పించారు. అట్లతద్ది వేడుకను మహిళలు వైభవంగా నిర్వహించారు.