గూడెంలో జాతీయ స్థాయి పోటీలు

62చూసినవారు
గూడెంలో జాతీయ స్థాయి పోటీలు
కళలకు, కళాకారులకు నిలయం తాడేపల్లిగూడెం అని బీవీఆర్ కళా కేంద్రం వ్యవస్థాపకులు బుద్ధా వెంకటరామారావు అన్నారు. తాడేపల్లిగూడెం బుద్దాల కన్వెన్షన్ హాల్లో జాతీయ స్థాయి ఉగాది ఆహ్వాన నాటిక పోటీలు, నృత్యోత్సవాలను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అలాగే, నాటిక ప్రదర్శనలు జరిగాయి. పైలు శ్రీనివాస్, కళాకారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్