ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఇళ్ళు లేని పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలాలు మంజూరు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోణాల భీమారావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం తాడేపల్లిగూడెంలో సీపీఐ ఇళ్ళ స్థలాలు దరఖాస్తులు పంపీణీ చేసి దరఖాస్తులను పూరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కోరారు.