అత్తిలి: ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతున్న యువకుడిపై కేసు

50చూసినవారు
అత్తిలి: ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతున్న యువకుడిపై కేసు
అత్తిలి మండలం బల్లిపాడు ఉన్నత పాఠశాల వద్ద ఈవ్ టీజింగ్ చేస్తున్న ఓ యువకుడిపై బైండోవర్ కేసు నమోదు చేసినట్లు అత్తిలి తహసీల్దార్ దశిక వంశీ సోమవారం తెలిపారు. ఆయన వివరాలు ప్రకారం గణపవరం మండలం మొయ్యేరు గ్రామానికి చెందిన పులిదిండి రవితేజ బల్లిపాడు ఉన్నత పాఠశాల వద్ద తరచూ బాలికలను ఈవ్ టీజింగ్ చేస్తూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుపై అత్తిలి ఎస్ఐ పి. ప్రేమరాజు రవితేజను అదుపులోకి తీసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్