మావోయిస్టుల చేతిలో మృతి చెందిన జవాను కుటుంబానికి పరామర్శ

78చూసినవారు
మావోయిస్టుల చేతిలో మృతి చెందిన జవాను కుటుంబానికి పరామర్శ
సీఆర్పీఎఫ్ లో పనిచేసి మావోయిస్టులు పెట్టిన ల్యాండ్ మైన్ పేలిన ఘటనలో మృతి చెందిన తణుకు పట్టణానికి చెందిన జవాను పడాల సాంబశివరావు వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం తణుకులో నిర్వహించారు. 1998వ సంవత్సరంలో మృతి చెందిన సాంబశివరావు కుటుంబాన్ని సిఐఎస్ఎఫ్ సిబ్బంది, తణుకు పట్టణ పోలీస్ సిబ్బంది పరామర్శించి సంతాపం తెలిపి సాంబశివరావు భార్య లక్ష్మిని ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్