అభివృద్ధి కొనసాగాలంటే జగన్ మళ్ళీ సీఎం కావాలి: మంత్రి కోడలు

85చూసినవారు
అభివృద్ధి కొనసాగాలంటే జగన్ మళ్ళీ సీఎం కావాలి: మంత్రి కోడలు
రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కోడలు కీర్తి పేర్కొన్నారు. సోమవారం తణుకు పట్టణంలోని మూడవ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా కీర్తి మాట్లాడుతూ తణుకు ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరితో పాటు ఎంపీ అభ్యర్థి ఉమాబాలను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్