తణుకులో పారిశుద్ధ్య నిర్వహణ ఒక ఉద్యమంలా తీసుకోవాలని అధికారులు, ప్రజలకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. సోమవారం తణుకు మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య నిర్వహణపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ఐదేళ్ల కాలంలో పారిశుద్ధ్యాన్ని అప్పటి పాలకులు అటకెక్కించారని విమర్శించారు. అన్ని వర్గాలు భాగస్వామ్యం అయితేనే గ్రీన్ తణుకు సాధించగలమన్నారు.