తణుకు నియోజకవర్గంలో పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆదివారం క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 31 మందికి సుమారు 40 లక్షల సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.