పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ కాళ్ల మండల ఎంపీపీ పెన్మత్స శిరీష విశ్వనాథరాజు శనివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. అలాగే ఆమెతోపాటు మండలంలోని ఎంపీటీసీలు మరియు వైసీపీ నాయకులు టిడిపిలో చేరడం జరిగింది.