కాళ్ల మండలం కాళ్ల ఉప కేంద్రంలో 11 కె. వి. లైన్లు మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు పనుల నిమిత్తం సోమవారం సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆ శాఖ ఈఈ పీర్ అహ్మద్ ఖాన్ తెలిపారు. సోమవారం ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు ఎస్సీ బోస్ కాలనీ, ఇసుక లంక, మాలవానితిప్ప, గోగుతిప్ప, ఆనందపురం, దొంగపిండి, గూట్లపాడు గ్రామాలకు విద్యుత్ ఉండదని అధికారులు పేర్కొన్నారు.