విజయదశమి సందర్భంగా ఉండి మండలం, వెలివర్రు గ్రామంలో శ్రీ వీర పేరంటాళ్ళ అమ్మవారిని ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణ రాజు శనివారం కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విజయదశమిని పురస్కరించుకుని వీర పేరంటాళ్ళ అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.