అసహనం వ్యక్తం చేసిన భీమడోలు ఎంపీపీ

77చూసినవారు
భీమడోలు మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ కనుమాల రామయ్య అధ్యక్షతన సోమవారం జరిగింది. మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, సంక్షేమ కార్యక్రమాల అమలు గురించి అధికారులు వివరించారు. ప్రజాప్రతినిధులు లేవనేత్తిన ప్రశ్నలకు అధికారులు సమాధానాలు చెప్పారు. రానున్న వేసవిలో తాగునీరు ఇబ్బందులు తలెత్తకూడదని ఎంపీపీ సూచించారు. సమావేశానికి నామమాత్రంగా సభ్యులు హాజరు కావడంపై ఎంపీపీ అసహనం వ్యక్తం చేసారు.

సంబంధిత పోస్ట్