భీమడోలు మండలం గుండుగొలను వద్ద నిర్మితమవుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను శనివారం ఏలూరు జిల్లా టిడిపి అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ. త్వరగా నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.