ముదినేపల్లి: శరన్నవరాత్రి వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర
ముదినేపల్లి మండలం కనకదుర్గ ఆలయంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి వేడుకల్లో శనివారం మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్థులు, టీడీపీ నాయకులు సాదరంగా ఆహ్వానించి భారీ గజమాలతో సత్కరించారు. అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని మంత్రికి అందించారు. ఆయనతోపాటు కైకలూరు, పెడన ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, కాగిత కృష్ణ ప్రసాద్, నాయకులు కొత్తూరు విటల్, జగన్మోహన్ రావు పాల్గొన్నారు.