ఈ నెల 8న విజయవాడలో జరుగుతున్న కౌలు రైతుల రాష్ట్ర సదస్సు జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ కోరారు. శనివారం ఏలూరు జిల్లా పరిషత్ ఆవరణలో కౌలు రైతుల రాష్ట్ర సదస్సు కరపత్రాలను రైతు సంఘం, కౌలు రైతుల సంఘం నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా కె. శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా పంటలు దెబ్బతిని కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.