ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ లో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడిని మహిళ చిన్న వివాదం కారణంగా తన షూ తీసుకుని నడిరోడ్డుపై దారుణంగా కొట్టింది. కొట్టవద్దని వేడుకున్నా వదల్లేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.