Sep 28, 2024, 14:09 IST/
పాకిస్థాన్లో కూలిన హెలికాప్టర్.. ఏడుగురు దుర్మరణం
Sep 28, 2024, 14:09 IST
పాకిస్తాన్లో ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులోని శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తర వజీరిస్తాన్లో ఓ హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. చార్టర్డ్ విమానం ఆయిల్ కంపెనీకి చెందిన ఉద్యోగులను తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. మరణించిన వారిలో ముగ్గురు రష్యా జాతీయులు, ఇద్దరు పైలట్లు, ఒక క్రూ మెంబర్ ఉన్నట్లు తెలుస్తోంది.