Mar 19, 2025, 07:03 IST/
బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజలు
Mar 19, 2025, 07:03 IST
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం వార్షిక బడ్జెట్‌ను భట్టి విక్రమార్క ప్రవేశపెట్టబోతున్నారు. ప్రజాభవన్ ఆవరణలోని నల్ల పోచమ్మ ఆలయంలో అమ్మవారి ముందు బడ్జెట్ ప్రతులను పెట్టి సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాసేపట్లో కేబినెట్ సమావేశం జరగనుంది. ఆ భేటీలో బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపాక.. ఉ. 11.02 నిమిషాలకు బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.