మంగళగిరి డీఎస్సీ ఎదుట మాజీ మంత్రి జోగి రమేష్ విచారణ ముగిసింది. న్యాయవాదులతో కలిసి పీఎస్‌కు వచ్చిన జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. 'నా కొడుకుపై తప్పుడు కేసులు పెట్టి పాలకులు ఆనంద పడుతున్నారు. రాజకీయ కోపముంటే నాపై తీర్చుకోవాలి. పిల్లల జోలికి వెళ్లడం సరికాదు. అనుమానాలుంటే చంద్రబాబు, పవన్ దగ్గరకు వెళ్లి వివరణ ఇస్తా. పరుష పదజాలం వాడిన మా పరిస్థితి ఏమైందో.. ఇప్పటి పాలకుల పరిస్థితి అదే అవుతుంది' అని జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.