AP: రాష్ట్రంలో జనాభా పెంచేందుకు ప్రోత్సాహకాలు ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కనీసం ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హత కల్పిస్తూ చట్టం తీసుకొస్తామని ఆయన చెప్పారు. ఇకపై ఎలాంటి పథకం అమలు చేయాలన్నా కుటుంబ పరిమాణాన్ని ప్రామాణికంగా తీసుకుంటామని తెలిపారు. జనాభా ఒకప్పుడు భారమని, ఇప్పుడు అదే ఆస్తి అని చెప్పుకొచ్చారు. రాష్ట్ర జనాభా తగ్గుముఖం పట్టనుందని ఆందోళన వ్యక్తం చేశారు.