48 గంటల్లో రాజీనామా చేస్తా: కొలికపూడి శ్రీనివాస్(వీడియో)

61చూసినవారు
AP: బాధితులకు న్యాయం జరగనప్పుడు తాను ఎమ్మెల్యేగా ఎందుకు ఉండాలని టీడీపీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేత రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే తాను 48 గంటల్లో రాజీనామా చేస్తానని శ్రీనివాస్ అన్నారు. రమేష్ రెడ్డి వ్యవహారాన్ని టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లానని, వారు చర్యలు తీసుకుంటారని తెలిపారు. తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న వారు తిరువూరులో ఎక్కడైనా పబ్లిక్ డిబేట్  పెట్టినా వస్తానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్