మేడ పైకి ఎక్కి దూకేస్తానంటూ మహిళ హల్‌చల్ (వీడియో)

85చూసినవారు
విశాఖపట్నంలోని పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో గల మధురవాడ వద్ద ఓ మహిళ మేడ పైకి ఎక్కి దూకేస్తానంటూ హల్‌చల్ చేసింది. కుటుంబ గొడవలతో మనస్తాపానికి గురైన మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి మేడ పైకి ఎక్కింది. అయితే చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పీఎం పాలెం ఎస్సై భాస్కర్ చాకచక్యంగా వ్యవహరించి ఆమెను కిందకు దింపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్