పొన్నగంటి కూరతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పొన్నగంటి కూరలో విటమిన్ ఎ, సి, ఇ, ఐరన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది డయాబెటీస్, క్యాన్సర్, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులను తగ్గిస్తుంది. ఇంకా పొన్నగంటి కూర తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. బరువు అదుపులో ఉంటుంది. ఈ ఆకుల రసాన్ని ముఖం మీద రాసుకుంటే చర్మ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.