డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ శాసనభలో సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం, తాజా జనాభా లెక్కల ప్రకారం, రాష్ట్ర అసెంబ్లీలో సీట్ల సంఖ్యను వెంటనే 119 నుంచి 153కి పెంచాలని తీర్మానించింది. దీని కోసం అవసరమైన రాజ్యాంగ సవరణలను ప్రవేశ పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర శాసనభ కోరుతోందని రేవంత్ రెడ్డి ప్రకటించారు.