వైసీపీ మాజీ మంత్రి అనిల్‌పై మహిళ ఫిర్యాదు

68చూసినవారు
వైసీపీ మాజీ మంత్రి అనిల్‌పై మహిళ ఫిర్యాదు
నెల్లూరులో వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు బిగ్ షాక్ తగిలింది. ముస్లిం మహిళ కౌసర్ జాన్.. అనిల్ కుమార్ యాదవ్‌పై చిన్నబజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. జనార్ధన్ రెడ్డి కాలనీలోని తన భూమిలో అక్రమంగా వైసీపీ కార్యాలయం నిర్మిస్తున్నారని కౌసర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై అనేక సార్లు అనిల్ కుమార్, వైసీపీ నేతల చుట్టూ తిరిగినా న్యాయం చేయలేదని కన్నీటి పర్యంతమయ్యారు. తనకు న్యాయం చేయాలని కౌసర్ ఫిర్యాదులో రాసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్