2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయానికి కీలకంగా పని చేసిన ఎన్ఆర్‌ఐ టీడీపీ ప్రతినిధులు ఇక నుంచి 2029 ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. శుక్రవారం సచివాలయంలో తనను కలిసిన ఎన్ఆర్‌ఐ టీడీపీ ప్రతినిధులతో కాసేపు మాట్లాడారు. తమ బృందం ఎన్ఆర్ఐ టెక్ బ్రెయిన్స్ పేరుతో 2024 ఎన్నికల సమయంలో చేసిన కృషి గురించి మంత్రి అనగానికి వారు వివరించారు.