మాజీ సీఎం జగన్‌పై సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. గత ఐదేళ్లలో వైసీపీ రూ.10 లక్షల కోట్ల అప్పులు చేసి జంప్ అయ్యిందని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించిన చంద్రబాబు మాట్లాడారు. పేదలు ఎక్కడుంటే తాను అక్కడుంటానని తెలిపారు. పేదల సంక్షేమమే టీడీపీ ధ్యేయమన్నారు. వైసీపీ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిపోతే.. తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి సంపద సృష్టించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.