నకిలీ గుండె వైద్యుడు చేసిన నిర్వాకం వలన ఒకే నెలలో ఏడుగురి ప్రాణాలు తీసిన ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. దమోహ్ పట్టణంలోని ప్రైవేటు మిషనరీ ఆస్పత్రిలో గుండె వైద్యుడు ఎన్ జాన్ కెమ్‌గా చలామణీ అవుతున్న నరేంద్ర విక్రమాదిత్య.. అదే పేరుతో ఓ ప్రసిద్ధ బ్రిటిష్ వైద్యుడు ఉండటాన్ని అవకాశంగా వినియోగించుకున్నాడు. పలువురు రోగులు మృత్యువాత పడటంతో అతని బాగోతం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.